Current Affairs Telugu Daily

‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ: ఇన్‌సైడ్‌ ద ట్రంప్‌ వైట్‌హౌస్‌’ బుక్‌లో ట్రంప్‌పై సంచన విషయాలు
- సీనియర్‌ జర్నలిస్టు, రచయిత మైకేల్‌ వూల్ఫ్‌ పుస్తకం ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ: ఇన్‌సైడ్‌ ద ట్రంప్‌ వైట్‌హౌస్‌’లో అనేక వివాదస్పద, సంచన విషయాలు వెల్లడించింది. 
- ఇంకా మార్కెట్‌లోకి విడుదల కాని ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను గార్డియన్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌, న్యూయార్క్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌, ఇతర ప్రధాన పత్రికలు ప్రచురించాయి. 
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడు, వైట్‌హౌస్‌ ప్రధాన వ్యూహకర్తగా పనిచేసిన స్టీవ్‌ బ్యానన్‌ ఈ పుస్తక రచయితకు వెల్లడించిన అంతర్గత విషయాలు ఆసక్తికరంగా మారాయి. 
- అధ్యక్ష ఎన్నిక ప్రచారం, ట్రంప్‌ను గెలిపించేందుకు రష్యా జోక్యంపై ఆరోపణలు వంటి కీలకాంశాలపై ఈ పుస్తకంలో అత్యంత విశ్వసనీయమైన సమాచారం ఉండటం దుమారం రేపుతోంది. 
- ఈ పుస్తకంపై ట్రంప్‌ తీవ్రంగా మండిపడ్డారు.
- స్టీఫెన్‌ కెవిన్‌ బ్యానన్‌(64) అమెరికన్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌, రాజకీయవేత్త. 
- గతంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా కొనసాగారు. 
- ప్రస్తుతం బ్రీట్‌బార్ట్‌ న్యూస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 
- గతంలో 7 సం॥ల పాటు యూఎస్‌ నేవీలో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. 
- ఎర్త్‌సైన్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు బయోస్పియర్‌-2’కు యాక్టింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 
- ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ప్రత్యేకంగా బ్యానన్‌ కోసమే వైట్‌హౌస్‌ ప్రధానవ్యూహకర్త హోదాను సృష్టించారు. 
- దాదాపు 7 నెలల పాటు ఆ పదవిలో పనిచేశాక ఛార్లెట్స్‌విల్లేలో చోటుచేసుకున్న ఘర్షణలు హింసాత్మకంగా మారిన ఘటన ఆయన ఉద్వాసనకు దారితీసింది. 
- 7  ముస్లిం దేశాల పౌరులపై నిషేధంలోనూ స్టీఫెన్‌ కెవిన్‌ బ్యానన్‌ పాత్ర ఉంది. 
- ఎన్నిక సందర్భంగా ట్రంప్‌ ప్రచార కార్యక్రమాలకు సీఈఓ హోదాలో స్టీఫెన్‌ కెవిన్‌ బ్యానన్‌ కీలకంగా వ్యవహరించారు. 
- వైట్‌హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక ఇవాంకాను ఉద్దేశించి ఇటుక మాదిరిగా ఆమె కూడా మూగదే అని వ్యాఖ్యానించారు.

views: 1415

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams