Current Affairs Telugu Daily

మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‍గా భారత్
భారత్ 2026 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల్ దేశంగా అవతరిస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేసింది. ఒక దేశానికి వచ్చే వెళ్ళే విమాన ప్రయాణికుల సంఖ్యనే ఇక్కడ ఏవియేషన్ మార్కెట్‍గా పరిగణలోకి తీసుకున్నాం. ఐఏటీఏ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశాల్లో ఇండియా 9వ స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.  2029 నాటికి చైనా అమెరికాను వెనక్కునెట్టి అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశంగా అవతరించనుంది. ఇక మనం 2026 నాటికి యూకేను వెనక్కు నెట్టి మూడో స్థానంలో నిలువనున్నాం.
views: 991

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams