Current Affairs Telugu Daily

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకు గవర్నర్‌గా మేనన్‌
- ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో 2018 సంవత్సరానికి గాను అత్యుత్తమ కేంద్ర బ్యాంకు గవర్నర్‌గా భారతీయ సంతతి వ్యక్తి నిలిచారు. 
- సింగపూర్‌ కేంద్ర బ్యాంకు అయిన మానిటరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌(ఎమ్‌ఏఎస్‌) ఎండీగా పనిచేస్తున్న రవి మేనన్‌కు బ్రిటన్‌కు చెందిన మ్యాగజైన్‌ ‘బ్యాంకర్‌’ గుర్తింపును ఇచ్చింది. 
- సింగపూర్‌ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో మేనన్‌ కృషికి ఈ గౌరవం దక్కింది. 
- ద ఫైనాన్షియల్‌ టైమ్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న ఈ మ్యాగజైన్‌ పలువురు బ్యాంకర్లు, ఆర్థికవేత్తలతో కలిసి ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టినట్లు ద స్ట్రైట్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. 
- సింగపూర్‌ ఆర్థిక మంత్రి హెంగ్‌ స్వీ కీట్‌ను సైతం 2011లో ఉత్తమ బ్యాంకరుగా ఈ మ్యాగజైన్‌ గుర్తించింది. 
- అప్పట్లో ఆయన ఎమ్‌ఏఎస్‌కు ఎండీగా ఉన్నారు. 
- గత మూడేళ్లలో వియత్నాం, భారత్‌, బంగ్లాదేశ్‌కు చెందిన కేంద్ర బ్యాంకు గవర్నర్లకు సైతం ఈ గుర్తింపు లభించింది.

views: 1107

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams