Current Affairs Telugu Daily

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశంలోనే అతి పెద్ద పంపు ఏర్పాటు 
- తెలంగాణలో చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఓ ఘనత సాధించింది. 
- దేశంలోనే అతి పెద్ద మోటారు పంపును ఈ పథకానికి అమర్చారు.. 
- దేశంలోనే ఎత్తిపోతల పథకంలో ఇంత పెద్ద మోటారు పంపు మరెక్కడా లేదని, ఒకేచోట ఇంత ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపుల్లో ప్రపంచంలోనే ఇదొకటని నీటిపారుదల శాఖ పేర్కొంటోంది. 
- దీని సామర్థ్యం 139 మెగావాట్లు. 
- ఈ పథకంలో అమర్చుతున్న మొత్తం ఏడు పంపుల్లో ఇది మొదటిది. 
- 180 టీఎంసీ నీటిని మేడిగడ్డ నుంచి మళ్లించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొత్తం 82 పంపులు, మోటార్లు అమర్చుతారు. 

views: 1372



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams