- కెమెరాలు, మొబైల్ ఫోన్లలో ఉపయోగించేందుకు వీలుగా భవిష్యత్తుతరం సూక్ష్మ కటకం ‘మెటాలెన్స్’ను హార్వర్డ్ పరిశోధకు ఆవిష్కరించారు.
- ఈ నూతన కటకంలో నానోఫిన్స్ అనే చిన్నచిన్న భాగాలుంటాయి.
- ఇవి కాంతి వేగాన్ని నియంత్రిస్తాయి. హరివిల్లులోని అన్ని రంగులపై దృష్టిపెట్టగల సామర్థ్యం మెటాలెన్స్ సొంతమని శాస్త్రవేత్తలు తెలిపారు.
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయబద్ధ కెమెరా కటకాలు పెద్ద పరిమాణంలో, వంగి ఉంటున్న సంగతిని గుర్తుచేశారు.
- వాటిని వెంట తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నారు.
- అందుకు భిన్నంగా మెటాలెన్స్ బల్లపరుపుగా ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు అనువుగా చిన్నగా ఉంటుందని తెలిపారు.
- కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లలో సంప్రదాయ కటకాలకు బదులుగా మెటాలెన్స్ను ఉపయోగిస్తే తద్వారా కలిసొచ్చిన అదనపు చోటును బ్యాటరీలు, ఇతర హార్డ్వేర్ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చునని వివరించారు.
views: 1022