Current Affairs Telugu Daily

మహాసముద్రాల సగటు ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌ 
- ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాల సగటు ఉష్ణోగ్రతను 3.5 డిగ్రీల సెల్సియస్‌గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 
-గతంలో ఎన్నడూ ఉపయోగించని ఓ అద్భుత విధానంలో ఈ ఉష్ణోగ్రతను గుర్తించారు. 
- నీటిపొర మధ్య ఉష్ణోగ్రతల్లో తేడాలు ఎక్కువగా ఉండడం వల్ల మహాసముద్రాల సగటు ఉష్ణోగ్రతను లెక్కించడం అత్యంత క్లిష్టమైన వ్యవహారం. 
- ప్రపంచవ్యాప్తంగా నీటి విస్తరణ తీరు కూడా భిన్నంగా ఉంటుంది. 
- ఈ అడ్డంకులను అధిగమిస్తూ మహాసముద్రాల సంయుక్త సగటు ఉష్ణోగ్రతను కనుగొనేందుకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకు సరికొత్త విధానాన్ని రూపొందించారు. 
- నూతన విధానంలో నీటి ఉష్ణోగ్రతను లెక్కించడానికి బదులు వాతావరణంలోని ఆర్గాన్‌, క్రిప్టాన్‌, గ్జీనాన్‌ అనే మూడు జడవాయువుల నిష్పత్తిని గుర్తిస్తారు. 
- వీటి పరిమాణం మహాసముద్రాల ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 
- మహాసముద్రాలు వెచ్చగా ఉన్నప్పుడు ఈ జడవాయువు తావరణంలోకి విడుదలవుతుంటాయని వివరించారు. 
- ప్రస్తుత ఆధునిక యుగంలో మహాసముద్రాల సగటు ఉష్ణోగ్రతను 3.5 డిగ్రీ సెల్సియస్‌గా ఈ విధానంలోనే నిర్ధారించారు.

views: 1068



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams