- సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను రెండు రెట్లకుపైగా పెంచడానికి ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ 2018 జనవరి 4న ఆమోదం తెలిపింది.
- ఈ బిల్లు చట్టరూపం దాల్చాక భారత ప్రధాన న్యాయమూర్తి నెలలవారీ వేతనం ఇప్పుడున్న రూ.లక్ష నుంచి రూ.2.80 లక్షలకు పెరుగుతుంది.
- సుప్రీం న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనం రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు చేరుతుంది.
- హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.80,000నుంచి రూ.2.25 లక్షలకు పెరుగుతుంది.
- 7వ వేతన సంఘం సిఫార్సుకు తగ్గట్టుగా రూపొందించిన ఈ మార్పు 2018 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
- రిటైర్డ్ న్యాయమూర్తులకు కూడా ఇవి వర్తిస్తాయి. ఇంటి అద్దె భత్యం వంటివి కూడా పెరగనున్నాయి.
- దివాలా స్మృతి బిల్లు, జాతీయ వ్యవసాయ-గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) బిల్లుల్లో రాజ్యసభ ప్రతిపాదించిన సవరణల్ని లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
views: 1158