Current Affairs Telugu Daily

ఆనంద శంకర్‍కు విశ్వకళా భారతి పురస్కారం
లలితకళలను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసిన వారికి చెన్నైకు చెందిన ప్రముఖ కళా సంస్థ భారత కళా సంస్థ భారత్ కళాచార్ ప్రతి ఏడాది అందించే 'విశ్వకళా భారతి' పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ నృత్యకారిణి ఆనంద శంకర్ జయంత్ ఎంపికయ్యారు. తమిళనాడులో జన్మించిన ఆమె సికింద్రాబాద్‍లోని సెయింట్ ఆన్స్ స్కూల్‍లో విధ్యనభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇండియన్ రైల్వేట్రాపిక్స్ సర్వీస్‍లో బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. భరతనాట్యం, కూచిపూడి కళలను ప్రోత్సహించడంలో చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ అవార్డులతో సత్కరించింది.
views: 1209



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams