Current Affairs Telugu Daily

ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌కు రూ.10 కోట్ల రక్షణశాఖ ప్రాజెక్టు
వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(NIT) మెటలర్జీ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.నర్సయ్య భారత రక్షణ శాఖకు చెందిన రూ.10 కోట్ల పరిశోధన ప్రాజెక్టును దక్కించుకున్నారు. డాక్టర్‌ ఎన్‌.నర్సయ్య ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫాటిగ్యు ఫ్రాక్చర్‌ మెకానిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. గతంలో ఎన్‌ఎంఎల్‌ జంషెడ్‌పూర్‌లో సీనియర్‌ శాస్త్రవేత్తలుగా కొంతకాలం పనిచేశారు. 2012లో వరంగల్‌ ఎన్‌ఐటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంత విలువైన ప్రాజెక్టు ఎవరికీ దక్కలేదు.
NIT -National Institutes of Technology

views: 1020

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams