Current Affairs Telugu Daily

ఫేస్‌బుక్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పార్లమెంటేరియన్‌ నరేంద్రమోడి
ఫేస్‌బుక్‌లో 2017 సం॥నికి అత్యంత ప్రజాదరణ పొందిన పార్లమెంటేరియన్లుగా ప్రధాని నరేంద్రమోడి(లోక్‌సభ), క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ (రాజ్యసభ)లు నిలిచారు. రాజకీయ పార్టీల్లో బీజేపీ ప్రథమ స్థానాన్ని, ఆప: 2వ స్థానాన్ని, కాంగ్రెస్‌ 3వ స్థానాన్ని దక్కించుకున్నాయి.  మొత్తంగా చర్చలు, స్పందనలు, షేర్లు, కామెంట్లు, లైక్‌ల ఆధారంగా ర్యాంకులను రూపొందించారు. అమిత్‌ షా, ఆర్‌.కె.సిన్హా, అసదుద్దీన్‌ ఒవైసీ, భగవంత్‌మన్‌ తదితరులు కూడా ర్యాంకుల్లో ఉన్నారు. అత్యున్నత కార్యాలయాల్లో పీఎంఓ, ప్రముఖుల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అత్యంత ప్రజాదరణ లభించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, వసుంధర రాజేలు ముందు వరుసలో ఉన్నారు.
views: 1383

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams