Current Affairs Telugu Daily

తెలంగాణలో మధ్యాహ్న భోజనంలో ప్రతి శనివారం వెజ్‌ బిర్యానీ 
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో ప్రతి శనివారం వెజిటబుల్‌ బిర్యానీ పెట్టనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 
- మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును ఇటీవల పరిశీలించిన కేంద్ర బృందం భోజనం మెనూను మార్చాలని సూచించింది. 
- కూరగాయలు, బఠానీలు, శనగలు, మీల్‌మేకర్లలు తదితర వాటితో చేసే బిర్యానీని విద్యార్థులు ఇష్టంగా తింటారని, పోషకాలుంటే ఈ బిర్యానీ ఆరోగ్యానికి కూడా మంచిదని కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
- రాష్ట్రంలో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం వినియోగించుకుంటున్నారు. 
మధ్యాహ్న భోజన పథకం శనివారం మెనూ
- ప్రతి శనివారం ఒకే రకంగా కాకుండా మార్పు ఉండేలా కేంద్ర బృందం మెనూను సూచించింది. దాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. 
-  బఠానీ పలావ్‌, కూరగాయలతో కుర్మా 
-  కాబూలీ శనగలు, కూరగాయలతో బిర్యానీ 
-  మీల్‌మేకర్‌ బిర్యానీ కూరగాయలతో  కుర్మా 
- మునక్కాయ ఆకులు, పెసర పప్పుతో కిచిడి, చట్నీ 
-  అన్నం, టమాటా, ఎండు బఠానీ కూర 
-  అన్నం, పెసర పప్పు, సోయాచిక్కుడు కూర

views: 1240

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams