Current Affairs Telugu Daily

రాజ్యసభలో 15 ఏళ్ల తర్వాత మొత్తం ప్రశ్నలకు అవకాశం 
రాజ్యసభలో 2018 జనవరి 2న అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.. 15 ఏళ్ల తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో మొత్తం ప్రశ్నలకు అవకాశం దక్కింది. దీంతోపాటు జీరో అవర్‌, ప్రత్యేక ప్రస్తావనల సమయంలోనూ అవకాశం లభించిన ప్రతిఒక్కరూ మాట్లాడారు. రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు చొరవ సభ్యుల సహకారంతో పెద్దలసభ ప్రశాంతంగా, పరిపూర్ణంగా సాగింది. 
- చివరిసారి 2002లో జరిగిన 197వ సమావేశంలో ప్రశ్నోత్తరాల జాబితాలోని అన్ని ప్రశ్నలనూ సభలో ప్రస్తావించే అవకాశం దక్కింది. అప్పట్లో ప్రశ్నలువేసిన 20మందిలో 10మంది హాజరుకాకపోవడంతో అది సాధ్యమైంది. 
- 2018 జనవరి 2 నాటి సభలో కొందరు సభ్యులు హాజరుకాకపోయినా వారి స్థానంలో మరికొందరికి అవకాశం కల్పించి మొత్తం 18 మందితో మాట్లాడించారు. ప్రశ్నోత్తరాలల్లో సభ్యులు పలు కీలకాంశాలపై ప్రశ్నలు వేశారు. అమరావతికి ప్రపంచబ్యాంకు రుణం, జీఎస్‌టీ ఫైలింగ్‌, భారతీయ సంప్రదాయేతర ఇంధనసంస్థ పనితీరు, బిట్‌కాయిన్‌.. దాని నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, మొండి బకాయిలు తదితర అంశాలపై చర్చించారు. 
- సంతాప తీర్మానాలు చదివేటప్పుడు సభ్యులు మాట్లాడొద్దని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. 
- రాజ్యసభ సిబ్బంది అశోక్‌ కుమార్‌ హత్యపై నివేదిక సమర్పించాలని హర్యానా ప్రభుత్వాన్ని వెంకయ్యనాయుడు నివేదిక కోరారు. 2017 డిసెంబర్‌ 30న బహదూర్‌గఢ్‌లో అశోక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. 

views: 1179

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams