Current Affairs Telugu Daily

లోక్‌సభకు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌బిల్లు-2017
చెక్కులు నిరాదరణకు గురైన కేసుల్లో జాప్యాన్ని నివారించి ఫిర్యాదిదారులకు మధ్యంతర పరిహారం త్వరగా అందేలా చూడడానికి ఉద్దేశించిన ‘నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ బిల్లు-2017’ను ప్రభుత్వం 2018 జనవరి 2న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 
- 1881లో రూపొందిన చట్టం స్థానంలో కొత్తచట్టం వస్తే చెక్కు మొత్తంలో 20 శాతాన్ని ముందుగా మధ్యంతర పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. 
- ఒకవేళ చెక్కును జారీచేసినవారు నిర్దోషిగా రుజువైతే అప్పుడు ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించవచ్చు. 
- దివాలా స్మృతి సవరణ బిల్లుకు రాజ్యసభ 2018 జనవరి 2న మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.

views: 1192

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams