Current Affairs Telugu Daily

తెలంగాణ ప్రభుత్వానికి రాజస్థాన్‌ పత్రిక ప్రశంసలు
రైతుల కోసం నిరంతర ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వాన్ని ‘రాజస్థాన్‌ పత్రిక’ అభినందించింది. 2018 జనవరి 2 నాటి తన సంపాదకీయంలో ప్రశంస జల్లు కురిపించింది. కొత్త సంవత్సరం మొదటిరోజే దేశంలోనే వ్యవసాయానికి 24 గంట ఉచిత విద్యుత్‌ అందిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, రైతుల్లో నిరాశ నిస్పృహలు రాజ్యమేలుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం స్వాగతించాల్సిన విషయమని, ఇక ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల వంతు వచ్చిందని రాజస్థాన్‌ పత్రిక పేర్కొంది.
views: 1280

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams