Current Affairs Telugu Daily

సౌదీ అరేబియా, యూఏఈలో తొలిసారి వ్యాట్‌
పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను 2018 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సర కానుకగా పెట్రోల్‌ ధరల్ని అమాంతం 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్‌ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. 
గల్ఫ్‌ కో`ఆపరేషన్‌లో 6 సభ్య దేశాలు కలవు
1. యూఏఈ
2. సౌదీ అరేబియా
3. బహ్రెయిన్‌
4. కువైట్‌
5. ఒమన్‌ 
6. ఖతర్‌ 
VAT-Value Added Tax 
GCC-Gulf Cooperation Council 
UAE-United Arab Emirates 

views: 1364



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams