Current Affairs Telugu Daily

IIM బిల్లు-2017కు రాష్ట్రపతి ఆమోదం
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(IIM)లకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న IIM బిల్లు-2017కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2017 డిసెంబర్‌ 31న ఆమోదం తెలిపారు. ఈ చట్టం కింద ఐఐఎంలు ఇకపై విద్యార్థులకు డిప్లొమాలకు బదులుగా డిగ్రీలు ప్రదానం చేయవచ్చు. ఈ బిల్లును 2017 జూలైలో లోక్‌సభ, డిసెంబర్‌లో రాజ్యసభ ఆమోదించాయి. తాజా చట్టం కింద ఐఐఎంల నిర్వహణ, బోధనా సిబ్బందితో పాటు డైరెక్టర్ల నియామకంలో సదరు సంస్థలకు మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించారు. ఈ చట్టం ప్రకారం ప్రతి ఐఐఎంకు 19 మంది సభ్యులతో కూడిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఏర్పాటు చేయనున్నారు.
IIM-Indian Institutes of Management

views: 1330

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams