Current Affairs Telugu Daily

ఆస్తుల విలువ లెక్కగట్టే వృత్తి నిపుణులకు IBBI నమోదు తప్పనిసరి
కంపెనీ చట్టం, దివాలా స్మృతి కింద ఆస్తుల మూల్యంకన చేసే వృత్తి నిపుణులకు భారత దివాలా బోర్డు(IBBI)లో నమోదు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం విలువ లెక్క గట్టే వ్యక్తికి తగిన అర్హతలు, అనుభవంతో పాటు గుర్తింపు పొందిన సంస్థలో సభ్యుడిగా ఉండాలి. వీటికి తోడు ఐబీబీఐ వద్ద నమోదై ఉంటేనే ఆ తరహా కార్యకలాపాలు చేయడానికి అర్హత ఉంటుంది.
IBBI- Insolvency and Bankruptcy Board of India

views: 1207

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams