Current Affairs Telugu Daily

ఆన్‌లైన్‌లో విక్రయించే వస్తువులకు MRP, ఇతర వివరాలు తప్పనిసరి
ఆన్‌లైన్‌లో విక్రయించే వస్తువుల ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధర(MRP), గడువు (ఎక్స్‌పైరీ) తేదీ, కస్టమర్‌ కేర్‌ వివరాలు వంటి సమాచారం ముద్రించడం తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి తూనికలు, కొలతల విభాగం నిబంధనను వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. ఇ-కామర్స్‌ కంపెనీలు 6 నెలల్లోగా కొత్త నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించే వస్తువు వివరాలను విక్రేతలు తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధన ప్రకారం ఎంఆర్‌పీతో పాటు తయారీ తేదీ, గడువు తేదీ, నికర పరిమాణం, తయారైన దేశం, కస్టమర్‌ కేర్‌ వివరాలు లేబుల్‌పై తప్పనిసరిగా ఉండాలి.
MRP-Maximum Retail Price

views: 1178

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams