Current Affairs Telugu Daily

‘టీఎస్‌కాప్‌’ యాప్‌ ఆవిష్కరణ
పోలీసుల పనంతా ఫోన్‌లలో, ట్యాబ్‌లలో పూర్తయ్యే విధంగా రూపొందించిన ‘టీఎస్‌కాప్‌’ యాప్‌ను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి 2018 జనవరి 1న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. 2018ని తెలంగాణ ప్రభుత్వం ‘సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరం’గా ప్రకటించిన నేపథ్యంలో తొలిరోజునే ఈ యాప్‌ను ఆవిష్కరించారు. 
- ఈ యాప్‌లో ప్రస్తుతమున్న 54 పోలీసు సేవలను ఇందులో పొందుపరిచారు. వీటిని భవిష్యత్తులో పెంచుకోవచ్చు. ఉదాహరణకు దర్యాప్తు అధికారికి పాత నేరస్తుల చిట్టా, వారు వాడే వాహనాలు, గతంలో వారిపై నమోదైన కేసులు, వారు నేరంచేసే తీరుపై సమాచారం కావాలి. ఏదైనా నేరం జరిగినప్పుడు ఘటనా స్థలానికి వెళ్లేలోగా ఆ పరిసరాల్లో గతంలో జరిగిన నేరాలు, వాటికి పాల్పడినవారి వివరాలు, ప్రస్తుతం వారెక్కడ ఉంటున్నారు తదితర వివరాలన్నీ దర్యాప్తు అధికారికి తెలుస్తాయి. 
- గతంలో జరిగిన నేరాల వివరాన్నీ జియో ట్యాగింగ్‌ చేస్తారు. తద్వారా ఆయా ప్రాంతాలపై గస్తీ సిబ్బంది ఎక్కువగా దృష్టి సారించే వీలుంటుంది. 
- పాత నేరగాళ్ల గృహాలను జియో ట్యాగింగ్‌ చేశారు. దీంతో వారి కదలికలను అధికారులు గమనించవచ్చు. ఏ రోజు ఎంతమంది నేరస్థును గస్తీ సిబ్బంది పర్యవేక్షించారన్నది ఉన్నతాధికారుకు తెలిసిపోతుంది. నేరస్థుల వేలిముద్రలు పోలీసు డేటాబేస్‌లో ఉంటాయి. ఈ యాప్‌ను ఉపయోగించి, అనుమానితుడి వేలి ముద్రలను చిన్న పరికరం ద్వారా పరీక్షిస్తే అతని నేర చిట్టా కనిపిస్తుంది. 
- కంట్రోల్‌ రూంకు అత్యవసర ఫోన్‌కాల్‌ వచ్చినప్పుడు సమీపంలోని గస్తీ బృందానికి సమాచారం అందుతుంది. ఈ విషయం ఉన్నతాధికారులకూ చేరుతుంది. ఎంత సేపటిలో ఘటనా స్థలానికి చేరుకోవచ్చన్నది అంచనా వేయవచ్చు. ఒకవేళ ఆస్యమైతే, కారణాలను తెలుసుకుని చక్కదిద్దవచ్చు. 
- ఘటనా స్థలంలో బలగాల అవసరం ఉన్నప్పుడు ఒక గస్తీ బృందం ఈ యాప్‌ ద్వారా సమీపంలోని ఇతర బృందాలను అప్రమత్తం చేసి, రప్పించుకునే వీలుంది. 
- ఎక్కడెక్కడ ఎంతమంది ట్రాఫిక్‌ సిబ్బందిని మోహరించారన్నది పై అధికారుల ఫోన్‌లో కనిపిస్తుంది. క్షేత్ర స్థాయిలో నిజంగానే అక్కడ కేటాయించినంత మంది ఉన్నారా? లేరా? అన్నది గమనించడం సులభమవుతుంది.

views: 1465

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams