Current Affairs Telugu Daily

హెచ్ ఎఫ్ సీలపై చారిత్రక ఒప్పందం
పర్యావరణానికి పెనుముప్పుగా మారిన హైడ్రోఫ్లోరోకార్బన్ (హెచ్‍ఎఫ్‍సీ) ల వాడకాన్ని గణనీయంగా తగ్గించేందుకు భారత్ సహ 200 దేశాలు అంగీకరించాయి. సుదీర్ఘ చర్చల తర్వాత చారిత్రక ఒప్పందానికి అంగీకారాం కుదిరింది. సాధారణంగా వెలువడే కార్బన్ డయాక్సైడ్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా భూతాపానికి కారణమయ్యేవే ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్, వీటిని ఎక్కువగా రిఫ్రిజి లేటర్ల్, ఏసీల్లో ఉపయోగిస్తుంటారు. రువాండా రాజధాని కిగిలిలో జరిగిన భేటీలో చట్ట బద్దత ఉన్న మాంట్రియల్ ప్రొటోకాల్‍కు సవరణలు చేసే అంశంపై విధానకర్తలు చర్చలు జరిపారు. సవరణకు 197 దేశాలు అంగీకరించాయి. ఈ శతాబ్ది చివరి నాటికి ఓజోన్ పొరను కాపాడేందుకు గ్లోబల్ టెంపరేచర్‍ను 0.5 degrees C కు తగ్గించాలని, ఓజోన్ పొర రక్షణ చర్యలు కొనసాగించాలని నిర్ణయించారు.
views: 1016



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams