Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో హిజ్రాలకు ప్రత్యేక విధానం 
హిజ్రాల (ట్రాన్స్‌జెండర్స్‌) కోసం ప్రత్యేక విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారికి అన్నిరకాల హక్కులు, రక్షణ కోసం సంబంధిత చట్టాల్లో అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధిపతులు, కార్యదర్శులను ఆదేశించింది. 
విధాన నిర్ణయాలు 
- హిజ్రాల్లో 18 సంవత్సరాల వయసుపైబడిన వారికి ఒక్కొక్కరికీ రూ.1500 చొప్పున పింఛను. 
- అన్ని స్థాయిల్లోనూ రాజకీయ పదవుకు నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు. 
- హిజ్రాలన్న కారణంగా వారి దరఖాస్తులను ఏ విద్యా సంస్థా తిరస్కరించేందుకు వీల్లేదు. 
- ప్రభుత్వ శాఖలు, సంస్థల పథకాల లబ్ధిదారుల ఎంపికలో, పొరుగు సేవల ఉద్యోగాల్లో అవకాశం. 
- హిజ్రాల సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు. 
- యాచక, దోపిడీ, వ్యభిచారంలాంటి వాటిని వదలివచ్చేవారికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం.
- 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 43,769 మంది హిజ్రాలున్నారని అంచనా వేస్తున్నారు. 
- హిజ్రాల సంక్షేమ పర్యవేక్షణను ప్రభుత్వ శాఖకు ప్రత్యేకంగా అప్పగించారు. 
- ప్రస్తుతం ఉన్న విభిన్న ప్రతిభావంతులు, వయోజన సంక్షేమశాఖతో హిజ్రాల పేరునూ కలిపారు. 

views: 1398

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams