Current Affairs Telugu Daily

లైబీరియా అధ్యక్షుడిగా జార్జ్‌ వీహ్
లైబీరియా నూతన అధ్యక్షుడిగా మాజీ ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌ జార్జ్‌ వీహ్ ఎన్నికయ్యారు. లైబీరియా ఉపాధ్యక్షుడు జోసెఫ్‌ బోకాయ్‌పై జార్జ్‌ వీహ్ విజయం సాధించారు. లైబీరియా అధ్యక్షురాలిగా ఎన్నికై ఆఫ్రికాలో మొట్టమొదటిసారి ఎన్నికైన మహిళా అధ్యక్షురాలిగా ఘనత సాధించిన జాన్సన్‌ సిర్లీఫ్‌ స్థానంలో జార్జ్‌ వీహ్ లైబీరియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2002లో ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన జార్జ్‌ వీహ్ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం లైబీరియా పార్లమెంట్‌లో సెనేటర్‌గా ఉన్నాడు.
views: 1133

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams