Current Affairs Telugu Daily

నిద్ర నాణ్యతను పసిగట్టే ‘యాక్టీమీటర్‌’ 
వ్యక్తుల నిద్ర నాణ్యతను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. నిద్ర అవాట్లను కూడా తెలుసుకునేందుకు దోహదపడటం ఈ నూతన పరికరం ప్రత్యేకత. నిద్రలేమి సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నవారి సంఖ్య ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. దీంతో ఈ అంశంపై పరిశోధనలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే జర్మనీలోని లుడ్‌విగ్‌ మాక్సిమిలియన్‌ విశ్వవిద్యాలయం(ఎల్‌ఎంయూ) పరిశోధకులు ‘యాక్టీమీటర్‌’ అనే పరికరాన్ని సృష్టించారు. ఇది మణికట్టుకు ధరించేందుకు వీలుగా ఉంటుంది. వ్యక్తులు దీన్ని ధరిస్తే.. వారు ఎంతసేపు నిద్రిస్తున్నారు? నిద్ర నాణ్యత ఎంత? వంటి అంశాలను సులభంగా గుర్తించవచ్చు. సగటున ఎన్ని గంటకు ఒకసారి నిద్రలోకి జారుకుంటున్నారనే అవాట్లను కూడా తెలుసుకునేందుకు ‘యాక్టీమీటర్‌’ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
views: 978

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams