Current Affairs Telugu Daily

క్షయకు అడ్డుకట్ట వేసే పదార్థం ‘బీటాలాక్టోన్‌ ఈజడ్‌120’ 
ప్రాణాంతక క్షయ వ్యాధికి అడ్డుకట్ట వేసే దిశగా శాస్త్రవేత్తలు ముందంజ వేశారు. క్షయకారక బ్యాక్టీరియాల్లో అత్యంత కీలకమైన త్వచం ఆవిర్భావాన్ని అడ్డుకోగల పదార్థాన్ని తయారుచేశారు. ఇతర యాంటీబయోటిక్‌ ఔషధాలతో కలిపి వాడినప్పుడు ఈ పదార్థం 100 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ‘మైకో బ్యాక్టీరియం ట్యుబర్‌క్యులోసిస్‌’ అనే బ్యాక్టీరియా కారణంగా క్షయ సంభవిస్తుంది. ఈ బ్యాక్టీరియా త్వచం ‘మైకోమెంబ్రేన్‌’లో లిపిడ్‌ పొరతో పటిష్టంగా ఉంటుంది. ఔషధాలు లోనికి ప్రవేశించి బ్యాక్టీరియా అంతంకాకుండా అడ్డుకుంటుంది. జర్మనీలోని మ్యూనిక్‌ సాంకేతిక విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై విస్తృత పరిశోధను నిర్వహించి ‘బీటాలాక్టోన్‌ ఈజడ్‌120’ అనే పదార్థాన్ని అభివృద్ధి చేశారు. ఇది బ్యాక్టీరియాల్లో మైకోమెంబ్రేన్‌ ఏర్పడకుండా అడ్డుకుంటుందని తెలిపారు. స్వల్ప పరిమాణంలో ఉపయోగించినా వాంకోమైసిన్‌ వంటి యాంటీబయోటిక్‌ ఔషధాలతో కలిపి వినియోగించినా ఈ నూతన పదార్థం ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
views: 1038

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams