Current Affairs Telugu Daily

అవినీతిని పసిగట్టేందుకు సరికొత్త నాడీ నమూనా ఎస్‌వోఎం
సమాజంలో చోటుచేసుకోబోయే అవినీతి, అక్రమాలను ముందుగానే పసిగట్టే సరికొత్త నాడీ నెట్‌వర్క్‌ నమూనా ‘స్వయం నిర్వాహక పటాలు(ఎస్‌వోఎం)’ను రష్యాలోని జాతీయ పరిశోధక విశ్వవిద్యాలయం, స్పెయిన్‌లోని వాల్లడోలిడ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల సంయుక్త కృషితో ఆవిష్కరించారు. ఆర్థిక, రాజకీయ కారకాలను విశ్లేషించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఎస్‌వోఎం పనితీరు అచ్చం మెదడును పోలి ఉంటుంది. ఆర్థిక వృద్ధి, ఇళ్ల ధరలు పెరగడం, ఆర్థికేతరరంగ సంస్థల పెరుగుదల వంటి అంశాలు సమాజంలో అవినీతిని ప్రేరేపించే అవకాశముందని తాజా నమూనాతో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకే రాజకీయ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటమూ అవినీతి, అక్రమాల పెరుగుదలకు కారణమవుతున్నట్లు కనుగొన్నారు. ఆయాప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక కారకాలను విశ్లేషించడం ద్వారా వచ్చే మూడేళ్లలో అక్కడ చోటుచేసుకోబోయే అవినీతిని ఎస్‌వోఎంతో పసిగట్టవచ్చునని పరిశోధకులు వెల్లడించారు.
views: 1011

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams