Current Affairs Telugu Daily

‘అర్థిస్తున్నా’ పదాన్ని వాడొద్దని ఉప రాష్ట్రపతి సూచన
అధికారిక పత్రాలను సభలో ప్రవేశపెట్టేటప్పుడు ‘అర్థిస్తున్నా’ అనే పదాన్ని వాడొద్దంటూ రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రులకు గుర్తు చేశారు. కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి పి.పి.చౌధరీ కొన్ని పత్రాలను 2017 డిసెంబర్‌ 29న రాజ్యసభకు సమర్పిస్తూ.. ‘అర్థిస్తున్నా’ అనే పదాన్ని వినియోగించారు. వెంటనే స్పందించిన వెంకయ్యనాయుడు ఆ పదాన్ని ఉపయోగించొద్దని చెప్పారు. మనది స్వతంత్ర దేశమని.. ‘అర్థిస్తున్నా’ పదాన్ని వాడకూడదని పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజునే మంత్రులకు వెంకయ్యనాయుడు సూచించారు. 
views: 985

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams