Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో స్మార్ట్‌ పోలీసింగ్‌ రోబో ఆవిష్కరణ
హెచ్‌బోట్స్‌ రోబోటిక్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ రూపొందించిన రోబోను 2017 డిసెంబర్‌ 29న హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఆవిష్కరించారు. 
- ఈ రోబోను వంద శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. 
- పోలీసు శాఖ వినియోగించేలా ఇందులో అప్లికేషన్లు రూపొందించారు. 
- షీ టీమ్స్‌, ట్రాఫిక్‌ నియంత్రణకు, బాంబును గుర్తించేలా ఇందులోని వ్యవస్థలు రూపొందించారు.
- దీన్ని త్వరలో రద్దీ ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద పరీక్షిస్తారు. 
- ప్రస్తుతం బీటా వెర్షన్‌ను ప్రదర్శిస్తున్న ఈ రోబోలో మార్పులు చేర్పులు చేసి మాస్టర్‌ రోబోను 2018 జులైలో ప్రారంభించనున్నారు

views: 1246

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams