హైదరాబాద్‍లో 'జాన్సన్' ల్యాబ్
రాష్ట్రంలో వివిధ రోగాల నిర్మూలనకు ప్రపంచ ప్రఖ్యాత ఔషదం కంపెనీలు ప్రభుత్వంతో చేతులు కలిపాయి. టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ సర్కార్‍తో ఒప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడుల సమీకరణలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కే.టీ.ఆర్ అమెరికాలో శుక్రవారం రెండో రోజు పర్యటించారు. ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా స్యూటికల్ విభాగ చైర్మన్ పాల్ స్టోఫెల్‍తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది భారత్ పర్యటనలో భాగంగా తెలంగాణకు రానున్నట్లు పాల్ తెలిపారు. ఫార్మాసిటీ పట్ల అసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‍లో జాన్సన్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో మెలిండా పేర్కొన్నారు.
views: 848

Current Affairs Telugu
e-Magazine
September-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams