ఐక్యరాజ్యసమితి తదుపరి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్ను సమితి సర్వ సభ్య సభ గురువారం నియమించింది. సమితి 9వ సెక్రటరీ జనరల్‌గా 67 ఏళ్ల గుటెరస్ నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని మొత్తం 193 దేశాల సర్వసభ్య సభ హర్షిస్తూ ఆమోదించింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్‌కి-మూన్ పదవీ కాలం ఈ ఏడాది Dec - 31 వ తేదీన ముగియనుంది. బాన్ తర్వాత ఆ పదవికి గుటెరెస్ను 15మంది సభ్యుల ఐరాస భద్రతా మండలి గతవారం ఎన్నుకుని ఆయన పేరును సర్వసభ్య సభకు సిఫారస్ చేసింది. గుటెరస్ 1995 నుండి 2002 వరకు పొర్చుగల్ పధానమంత్రిగా పనిచేశారు. 2005 జూన్ నుండి 2015 డిసెంబర్ వరకు శరణార్థులకు ఐరాస హైకమిషనర్‌గా ఉన్నారు. ఆయన 2017 జనవరి 1వ తేదీ నుండి సమితి సెక్రటరీ జనరల్‌గా కొత్త బాధ్యతలు చేపడతారు.
views: 1079