Current Affairs Telugu Daily

‘బతుకుపోరు, విలువలు’ పుస్తక ఆవిష్కరణ
తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు రచించిన ‘బతుకుపోరు, విలువలు’ పుస్తకాన్ని 2017 డిసెంబర్‌ 27న హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించారు. రాములు 90కి పైగా పుస్తకాలు రాసి బహుగ్రంథ కర్తగా పేరొందారు. తత్వశాస్త్రంతో పాటు తెలంగాణ వాస్తవ జీవన చిత్రంపై కథలు, నవలలు, కథానికలు, సాహిత్య విమర్శ, బీసీ సామాజిక వర్గాలపై రచనలు చేశారు. 
తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యులు
1. వకుళాభరణం కృష్ణమోహన్‌
2. ఆంజనేయగౌడ్‌
3. జూలూరు గౌరీశంకర్‌ 

views: 1278

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams