Current Affairs Telugu Daily

AAD సూపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం 
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌(AAD) సూపర్‌సోనిక్‌ క్షిపణిని భారత్‌ 2017 డిసెంబర్‌ 28న ఒడిశాలోని చాందీపూర్‌లో సమీకృత పరీక్ష వేదిక నుంచి విజయవంతంగా పరీక్షించింది. శత్రు క్షిపణిని ఆకాశంలో తక్కువ ఎత్తులో నేలకూల్చే సామర్థ్యం ఈ అస్త్రం సొంతం. ఏఏడీని ఈ ఏడాది పరీక్షించడం ఇది మూడోసారి. బహుళ అంచెతో కూడిన పూర్తిస్థాయి బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థను సాకారం చేయడం ఈ పరీక్ష ఉద్దేశం.
AAD-Advanced Air Defence
AAD విశేషాలు.. 
క్షిపణి పొడవు : 7.5 మీటర్లు 
దశలు : ఒక్కటి
ఇంధనం : ఘన 
ప్రత్యేకతలు: అధునాతన దిక్సూచి వ్యవస్థ, హైటెక్‌ కంప్యూటర్‌, ఎలక్ట్రో మెకానికల్‌ యాక్టివేటర్‌ వంటి వ్యవస్థలు దీని సొంతం. ఈ క్షిపణికి సొంత సంచార లాంచర్‌, శత్రు క్షిపణిని ఢీ కొట్టడానికి భద్రమైన డేటా లింక్‌బీ స్వతంత్ర గమన పరిశీలన, లక్ష్య ఛేదన వ్యవస్థ, అధునాతన రాడార్లు ఉన్నాయి.

views: 1197

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams