టీమ్ ఇండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదు ప్రోత్సాహకం అందజేసింది. ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిథాలీకి రూ.కోటి నజరానా, బంజారాహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. ఈమేరకు 2017 డిసెంబర్ 28న క్రీడ మంత్రి పద్మారావు, మిథాలీకి నగదు చెక్కు, ఇంటి స్థలం పత్రాల్ని అందజేశారు. కోచ్ మూర్తికి రూ.25 లక్షలు చెక్కు ఇచ్చారు.
views: 1221