Current Affairs Telugu Daily

థాయ్‍ల్యాండ్ రాజు కన్నుమూత
థాయ్‍లాండ్ రాజు భూమిబల్ అదుల్యాడెజ్ (88) కన్నుముశారు. గత రెండెళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు సిరిరాజ్ ఆస్పత్రిలో గురువారం మరణించినట్లు రాజభవన వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన 7 దశాబ్దల పాలన ముగిసినట్టైంది. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం (70) పాలించిన రాజుగా ఘనత సాధించిన భూమిబల్ విభిన్న అభిప్రాయాలతో ఉన్న థాయ్‍లాండ్‍ను సమైక్యంగా ఉంచడంలో సఫలీకృతులయ్యారు. 1946లో ఆయన సోదరుడి మరణానంతరం రాజ పదవిని అదిష్ఠించిన రాజు మరణం నేపథ్యంలో 63 ఏళ్ల యువరాజు మహా వజీరలాంగ్‍కార్న్ రాజు స్థానాన్ని అదిష్ఠిస్తారని ప్రధాన మంత్రి ప్రయుత చాన్ - ఓచా ప్రకటించారు.
views: 923

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams