Current Affairs Telugu Daily

డా॥ నాగేశ్వరరెడ్డికి ఎంజీ గార్గ్‌ జీవితకాల సాఫల్య పురస్కారం
ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్‌, పద్మభూషణ్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి ఐఎంఏ డాక్టర్‌ ఎంజీ గార్గ్‌ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. జాతీయ, అంతర్జాతీయంగా డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి అందిస్తున్న వైద్యసేవలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) ఆధ్వర్యంలో 2017 డిసెంబర్‌ 27న ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.కె.అగర్వాల్‌ చేతుల మీదుగా డాక్టర్‌ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 
views: 1006



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams