Current Affairs Telugu Daily

‘ది బెటర్‌ ఇండియా’ జాబితాలో మహేశ్‌ భగవత్‌కు చోటు 
సమాజ హితం కోసం కృషి చేసే వ్యక్తుల గురించి సానుకూల కథనాలను ప్రచురించే ‘ది బెటర్‌ ఇండియా’ సంస్థ జాబితాలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు చోటు దక్కింది. 2017 సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరిచిన 10 మంది పోలీసు అధికారుల్లో భగవత్‌ను ఒకరిగా సంస్థ ఎంపిక చేసింది. మహిళ, చిన్నారుల అక్రమ రవాణా నిరోధం కోసం మహేశ్‌ భగవత్‌ చేసిన విశేష కృషి గురించి ఈ సంస్థ ప్రచురించిన వ్యాసంలో పేర్కొంది. అమెరికా ‘2017 ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సన్స్‌ రిపోర్ట్‌ హీరో’ పురస్కారాన్ని మహేశ్‌ భగవత్‌కు అందజేసిన నేపథ్యంలో ‘ది బెటర్‌ ఇండియా’ సంస్థ తన జాబితాలో చోటు కల్పించింది. ఈ జాబితాలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆర్‌.కె.రవికృష్ణ (ప్రస్తుతం టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి)తోపాటు మనీష్‌శంకర్‌ శర్మ (మధ్యప్రదేశ్‌ ఐజీ), శ్రీలేఖ (కేరళ డీజీపీ), అస్రా గార్గ్‌ (తమిళనాడు తిరునల్వేలి రూరల్‌ ఎస్పీ), రూపా మాడ్గిల్‌ (కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ), సంజుక్త పరాషర్‌ (అసోం ఐపీఎస్‌), శివదీప్‌ లాండే (బిహార్‌ ఐపీఎస్‌), అరిఫ్‌ షేక్‌ (ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ఎస్పీ), శ్రేష్ఠ ఠాకూర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌ బుంద్‌షహర్‌ డీఎస్పీ) ఉన్నారు.
views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams