Current Affairs Telugu Daily

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం 
2018 జనవరి 23 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. దిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడం, హైదరాబాద్‌ వేదికగా ప్రపంచ పారిశ్రామికవేత్త సదస్సును విజయవంతంగా నిర్వహించడం, గత మూడేళ్లుగా తెలంగాణ పెట్టుబడుల కేంద్రంగా ఉండటం తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకుని ఆహ్వానం పంపినట్టు సదస్సు నిర్వాహకులు ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు జరిగే సదస్సులో ప్రపంచంలోని 2,500 ప్రఖ్యాత కంపెనీ సీఈవోలు, పారిశ్రామిక, ఆర్థిక వేత్తులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు. గతంలో చైనాలో జరిగిన వేదిక సమావేశానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులకు మాత్రమే గతంలో ఆహ్వానాందాయి. రాష్ట్ర మంత్రికి ఇలాంటి ఆహ్వానం ఇదే ప్రథమం.
views: 1065

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams