Current Affairs Telugu Daily

120 ఏళ్లలో తొలిసారి ఆదిలాబాద్‌లో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 
తెలంగాణ రాష్ట్రంలో 120 ఏళ్ల చరిత్రలోనే అత్యంత తక్కువగా 3 డిగ్రీల ఉష్ణోగ్రత 2017 డిసెంబర్‌ 27న ఆదిలాబాద్‌లో నమోదైంది. ఈ పట్టణంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత రికార్డు 2017 డిసెంబర్‌ 19న 3.8 డిగ్రీలు నమోదవగా ఇప్పుడు అది కాస్త పటాపంచలైంది. వాస్తవానికి 2014 డిసెంబరు 20న 3.9 డిగ్రీలుండగా అది ఈ నెల 19న మారిపోయింది. రాష్ట్రంలో అంతకుముందు అత్యంత తక్కువ ఉషోష్ట్రూగ్రత నిజామాబాద్‌లో 1897 డిసెంబరు 17న 4.4 డిగ్రీలుండగా 2014 ఆదిలాబాద్‌లో 3.9 డిగ్రీలు వచ్చేదాకా కొనసాగింది. ఈ రికార్డు కేవలం 9 రోజుల వ్యవధిలో రెండుసార్లు బద్దలైంది. రాష్ట్రంలో వాతావరణంలో వస్తున్న మార్పుకు ఇది సంకేతంగా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
views: 1054

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams