7 ఖండాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించిన భారత వైమానిక దళ బృందం
భారత వైమానిక దళంలోని పర్వతారోహణ బృందం అరుదైన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను తమ పాదాక్రాంతం చేసుకుని వైమానిక దళ పతాకాన్ని ఎగురవేసింది. 2017 డిసెంబర్ 26న అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ను అధిరోహించటంతో వారి దిగ్విజయ యాత్ర పూర్తయ్యింది. పర్వతారోహకులకు పెనుసవాల్ నిలిచే ఈ శిఖరాలను జయించటం అత్యంత సాహసోపేతమైనది. ఆర్.సి.త్రిపాఠి సారథ్యంలోని ఐఏఎఫ్ పర్వతారోహక బృందం విన్సన్ శిఖరాన్ని అధిరోహించి సప్త మహాశిఖర అధిరోహణ లక్ష్యాన్ని పూర్తి చేశారు.
సప్త మహా శిఖరాలు
1. ఎవరెస్టు (ఆసియా - 8848 మీటర్లు)
2. అకొన్కగువా (దక్షిణ అమెరికా- 6962మీటర్లు)
3. డెనాలి (ఉత్తర అమెరికా-6190మీటర్లు)
4. కిలిమంజరో(ఆఫ్రికా-5895 మీటర్లు),
5. ఎల్బ్రస్ (ఐరోపా-5642మీటర్లు),
6. విన్సన్ (అంటార్కిటికా-4897మీటర్లు),
7. కార్స్టెన్స్ పిరమిడ్ (ఇండోనేసియా-4884 మీటర్లు)
views: 999