Current Affairs Telugu Daily

జాతీయ గణిత దినోత్సవం 
దేశవ్యాప్తంగా 2017 డిసెంబర్‌ 22న జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 22ను జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహిస్తారు. 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ డిసెంబర్‌ 22ను జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. శ్రీనివాస రామానుజన్‌ 1917లో లండన్‌ మ్యాథమెటికల్‌ సొసైటీకి ఎన్నికయ్యారు. 1918లో రాయల్‌ సొసైటీ ఫెలో అయ్యారు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. శ్రీనివాస రామానుజన్‌ 1920 ఏప్రిల్‌ 6న మృతి చెందారు.
views: 1008

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams