Current Affairs Telugu Daily

కార్ల అదనపు బంపర్ల వినియోగంపై నిషేధం
దేశవ్యాప్తంగా అడ్డగోలుగా వాహనాలకు ముందు, వెనుక భాగంలో బంపర్ల ముందు అదనంగా ఇనుము, స్టీల్‌ రాడ్లను ఏర్పాటు చేయకుండా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ మేరకు రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్నేళ్లగా దేశవ్యాప్తంగా క్షలాదిమంది వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనుక భాగంలో బంపర్ల ముందు స్టీల్‌ రాడ్లను అదనపు పిట్టింగ్‌గా ఏర్పాటు చేస్తున్నారు. రద్దీ రోడ్లలో వెళ్లినపుడు వెనుక వాహనాలు ఢీకొనడం వల్ల బంపర్లు దెబ్బతింటున్నాయన్న ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ రాడ్లను ఏర్పాటు చేయడం వల్ల తరచూ పాదచాయి పెద్దఎత్తున చనిపోతున్నారంటూ అనేక మంది కేంద్ర రవాణా శాఖకు ఫిర్యాదు చేశారు. ఎక్కువ మంది వాహనదారులు ఈ రాడ్లను పొడువుగా బిగించుకోవడం వల్ల ఇవి పాదచారుల పాలిట మృత్యువుగా మారాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల రవాణాశాఖ, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ అదనపు పిట్టింగ్‌ను తక్షణం నిషేధిస్తూ కేంద్రం ఆదేశించింది. 1988 కేంద్ర మోటారు వాహనాల చట్టం సెక్షన్‌ 152 కింద ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
views: 967

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams