Current Affairs Telugu Daily

తెలంగాణలోని కొత్త మండలాల్లో వాతావరణ కేంద్రాలు 
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో స్వయంచాలిత వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక మండలి(TSDPS) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 125 మండలాల్లో వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసి టీఎస్‌డీపీఎస్‌కు అనుసంధానం చేయనున్నారు. 2008లో హైదరాబాద్‌ మహానగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఏర్పాటుచేసిన 492 ఏడబ్ల్యూఎస్‌లు సక్రమంగా పని చేయకపోవడంతోపాటు నిర్వహణ భారం పెరగడంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. మరో 120 కొత్త ఏడబ్ల్యూఎస్‌లను ఏర్పాటు చేయనున్నారు. సాంకేతికాంశాలు, ఏడబ్ల్యూఎస్‌ ఏర్పాటుకు సంబంధించి టెండర్లను సమీక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడుగా ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌ విభాగం సంచాలకుడు వ్యవహరించనున్నారు. టీఎస్‌డీపీఎస్‌ సీఈఓ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనుండగా మరో 12 మందిని సభ్యులుగా నియమించారు.
TSDPS-Telangana State Development Planning Society

views: 1107

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams