Current Affairs Telugu Daily

కాంట్రాక్ట్ థియరీ కి ఆర్థిక నోబెల్
ప్రముఖ ఆర్థిక వేత్తలు ఓలివర్ హార్ట్ బ్రిటన్ - అమెరికా, బెంట్ హోమ్ స్ట్రామ్ (ఫిన్‍లాండ్) లను ఈ ఏడాది ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారం వరించింది. కాంట్రాక్ట్ థియరీలో చేసిన విశేష కృషికి గాను వీరిని సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు అధికారుల వేతనంతో పాటు జైళ్ల నిర్వహణ వంటి వాటికి ఈ సిద్దాంతం ఎంతో ఉపయోగ పడుతుందని నోబెల్ జ్యూరీ చెప్పింది. అత్యున్నత స్థాయి అధికారులకు పనితీరు అధారిత వేతనం ఇన్సెటివ్‍లు, భీమాలో మినహాయింపులు పాలసీదారుల క్లేయిమ్‍లు ప్రభుత్వం సంస్థల కార్యకలాపాల ప్రవేటీకరణ ఒప్పందాల రూపకల్పనలో లోటుపాట్ల వంటి విభిన్న అంశాలెన్నింటినో సమగ్రంగా విశ్లేషించడం ద్వారా కాంట్రాక్ట్ థియరీని ఓలివర్, హోల్మ్ స్ట్రామ్‍లు అభివృద్ధి చెసినట్టు తెలిపింది. వాస్తవిక ఒప్పందాలు, సంస్థల గురించిన అవగాహన సమస్యల పరిష్కార మార్గాలతో పాటు టీచర్లు, హెల్త్‌ కేర్ వర్కర్లు, జైలు గార్డులు నిర్దేశిత లేదా పని ఆధారిత వేతనం పొందేందుకు ఈ సరికొత్త సైద్దాంతిక ఉపకరణాలు సహాయపడతాయని నోబెల్ కమిటీ సభ్యుడు పర్ స్ట్రాంబర్గ్ చెప్పారు. దివాలా చట్టం నుంచి రాజకీయ రాజ్యాంగం వరకు సంస్థలు విధానాల రూపకల్పనకు ఇది మేథోపునాది వేసినట్టు పేర్కొన్నారు. సమస్యేమిటో తెలుసుకోవడానికే కాకుండా వాస్తవ పరిస్థితులను విశ్లేషించే అవకాశం కాంట్రాక్ట్ థియరీ వల్ల కలుగుతుందని తద్వారా షేర్ హోల్డర్లు, కార్పోరేట్ బోర్డులు మరింత మెరుగైన ఒప్పందాలు రూపొందించుకోవడానికి అద్భుత సాధనంగా సహాయపడుతుందని తెలిపారు.
views: 1004

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams