Current Affairs Telugu Daily

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ, వడ ప్రసాదా ధరల పెంపు 
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రసాదాల ధరలు పెంపును 2017 డిసెంబర్‌ 21 నుంచి టీటీడీ ఆచరణలో పెట్టింది. అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే వారికి మాత్రమే పెంపు వర్తిస్తుంది. శ్రీవారిని దర్శించుకునే యాత్రికులకు దేవస్థానం అందచేసే ప్రసాదం ధరలో మార్పు చేయలేదు. లడ్డూ ప్రసాదా ధరలను గత పదేళ్లుగా టీటీడీ పెంచలేదు. 
- కల్యాణోత్సవం లడ్డూ పేరుతో పిలిచే ప్రసాదం బరువు 750 గ్రాములు ఉంటుంది. రూ.100 ఉన్న ఈ లడ్డూ ధరను రూ.200కు పెంచింది. 
- సాధారణ లడ్డూ బరువు 140 నుంచి 170గ్రాముల బరువుంటుంది. ఈ లడ్డూను రూ.25 నుంచి రూ.50 పెంచింది. 
- వడ ప్రసాదంను ఇప్పటి వరకు రూ.25 విక్రయిస్తుండగా దీన్ని రూ.100కు పెంచింది. 
- కాలినడకన వస్తూ దివ్యదర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 5 లడ్డూలు ఇస్తుండగా ఇందులో ఒకటి ఉచితం కాగా.. మరో రెండు రూ.20కి, ఇంకో రెండు రూ.50కి అమ్ముతోంది. మొత్తంగా రూ.70కి ఐదు లడ్డూలు వస్తున్నాయి. 
- ధర్మదర్శనం చేసుకునే యాత్రికులకు రూ.20పై రెండు, రూ.50పై మరో రెండు చొప్పున 4 లడ్డూలు అందిస్తున్నారు. 
- వీఐపీ బ్రేక్‌ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు చొప్పున టిక్కెట్లపై ఉచితంగా అందిస్తున్నారు. 
- తయారీ సామర్థ్యాన్ని నిత్యం 4 లక్షల లడ్డూలకు పెంచుకుని భక్తులు కోరినన్ని రూ.50 చొప్పున విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. 
- ధరల పెంపు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో విక్రయించే ప్రసాదానికీ వర్తిస్తుంది.

views: 1024



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams