Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌కు 9 స్కోచ్‌ అవార్డులు 
ఆంధ్రప్రదేశ్‌కు 9 విభాగాల్లో స్కోచ్‌ అవార్డులు దక్కాయి. ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖతోపాటు, రెవెన్యూశాఖకు మరో రెండు అవార్డులు దక్కాయి. స్కోచ్‌ టెక్నాజీ విభాగంలో నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ డ్యాష్‌బోర్డుకు, ఎల్‌ఈడీ లైట్ల పర్యవేక్షణకు గాను స్కోచ్‌ మొబిలిటీ అవార్డును, ఆర్‌ఎస్‌ ఐడీ కార్డు వినియోగించి చెత్త సేకరణ, పర్యవేక్షణకు స్కోచ్‌ బ్లూ ఎకనమీ బోర్డు అవార్డును, ఇదే విభాగంలో ఎన్టీఆర్‌ జలసిరికి స్కోచ్‌ బ్లూ ఎకానమీ అవార్డు, బ్లూ ఎకానమీలో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటుచేసిన జలవాణి కార్యక్రమానికి అవార్డు లభించాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ రామాంజనేయులు, మంత్రి లోకేశ్‌ ఓఎస్‌డీ రంజిత్‌బాషా, అడిషనల్‌ కమిషనర్‌ సుధాకర్‌, జాయింట్‌ కమిషనర్‌ కెఎస్‌ వరప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కిశోర్‌ 2017 డిసెంబన్‌ 20న న్యూడిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. మీసేవ, మీభూమి ద్వారా పాస్‌పుస్తకం 15 నిమిషాల్లో పొందే అవకాశాన్ని మీసేవ ద్వారా కల్పించారు. దీనికి సంబంధించిన స్కోచ్‌ అవార్డును అడిషనల్‌ సెక్రటరీ జగన్నాథం అందుకున్నారు.
views: 1144

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams