Current Affairs Telugu Daily

NGTఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ పదవీ విరమణ
జాతీయ హరిత ట్రైబ్యునల్‌(NGT) ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ 2017 డిసెంబర్‌ 19న పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ 2012 డిసెంబర్‌ 20న NGT ఛైర్మన్‌గా నియమితులై 5 సం॥ల పాటు పని చేశారు. జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ అనేక కీలక తీర్పు వెలువరించి పర్యావరణ పరిక్షణకు పాటుపడ్డారు. డిల్లీలో 10 సం॥లు దాటిన డీజిల్‌, 15 సం॥లు దాటిన పెట్రోల్‌ వాహనాలను నిషేధించడం, గంగ, యమున నదుల ప్రక్షాళన చేపట్టడం, హిమాచల్‌ప్రదేశ్‌లో అక్రమంగా నిర్మించిన హోటళ్లను కూల్చివేయడం తదితర అంశాలన్నీ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ తీర్పు వల్లనే జరిగాయి. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి రోజుకు 50 వేల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి వీల్లేదని, అమర్‌నాథ్‌ వద్ద ప్రజలు గట్టిగా అరుస్తూ శివనామ స్మరణ చేయకూడదని కూడా జస్టిస్‌ స్వతంత్య్రకుమార్‌ ఆదేశించారు.
NGT-National Green Tribunal 

views: 940

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams