Current Affairs Telugu Daily

సౌదీ రాజ భవనం లక్ష్యంగా ‘వోల్కనో హెచ్‌-2’ క్షిపణి ప్రయోగం 
సౌదీ అరేబియా రాజ భవనంవైపుగా దూసుకొచ్చిన బాలిస్టిక్‌ క్షిపణి ‘వోల్కనో హెచ్‌-2’ని 2017 డిసెంబర్‌ 19న మార్గమధ్యంలోనే భద్రతా బలగాలు కూల్చేశాయి. దీన్ని తామే ప్రయోగించామని యెమెన్‌లోని ఇరాన్‌ మద్దతున్న హుతి తిరుగుబాటుదారులు ప్రకటించారు. రాజు సల్మాన్‌ అధికారిక నివాసాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నామని స్పష్టం చేశారు. దక్షిణ రియాద్‌ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ ప్రభుత్వ వార్తాసంస్థ తెలిపింది. ఇది సౌదీ అరేబియాపై హుతిలు ప్రయోగించిన రెండో క్షిపణి. గత నెలలోనూ ఓ క్షిపణిని బలగాలు కూల్చేశాయి. 
views: 921

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams