రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సంయుక్తంగా ఎల్.బీ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ మహా ప్రదర్శనకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 12 వేల మంది మహిళలు హాజరయ్యరు. స్టేడియం మధ్యలో 20 అడుగుల ఎత్తయిన బతుకమ్మను తంగేడు, బంతి, గునుగు వంటి తీరొక్క పూలతో తీర్చిదిద్దారు. దాని చుట్టూ చిన్న చిన్న బతుకమ్మలను పెట్టారు. వాటి చుట్టూ 35 వరుసల్లో సుమారు 10 వేల మంది మహిళలు బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో బతుకమ్మ ఆడేందుకు వచ్చిన 10,029 మంది మహిళలకు గిన్నిస్బుక్ నిర్వాహకులు ట్యాగింగ్ చేశారు (స్టిక్కర్లు, అతికించారు) అయితే వర్షం వల్ల కొద్దిమంది గ్యాలరీలోకి వెళ్లడం, మరి కొందరు మధ్యలో బయటకు వెళ్లిరావడంతో బతుకమ్మ ఆడినవారు 9,292 మందిగా లెక్క తేల్చారు. దీనితో గిన్నిస్ బుక్లో ఇంతకు ముందున్న ఓనయ్ రికార్టును మన బతుకమ్మ అదిగమించింది. మహిళలు దాదాపు 2గం. పాటు బతుకమ్మ ఆడినప్పటికీ ఎక్కువ మంది ఆడిన సమయం 11ని. 07 సే. పరిగణనలోకి తీసుకున్నట్లు గిన్నిస్ బుక్ పరిశీలకులు తెలిపారు.
views: 1447