Current Affairs Telugu Daily

దసరా రోజున 11.13 ని. ముహూర్తంన కొత్త జిల్లాల ప్రారంభోత్సవం
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. దసరా రోజున అంటే  ఈ నెల 11వ తేదీని ఉదయం 11.13 గంటలకు కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరుగనుంది. అన్ని జిల్లాల్లోను ఇదే సమయంలో ప్రారంభోత్సవం జరగాలని సీ.ఎం. కె. చంద్రశేఖర్‍రావు ఆదేశించారు. ఇక కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం దసరా పండుగ రోజే ఉత్తర్వులన్ని జారీ చేయనుండి. ఆరోజు ఉదయమే దాదాపు 300కు పైగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. తోలుత కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటిస్తూ గేజిట్ నోటీఫికేషన్ జారీ అవుతుంది. ఆవెంటనే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ అవుతాయి. తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా ఆర్డర్ టు సర్వ్ విధానంలో అధికారులను నియమిస్తారు. అయితే ముందుగానే కొత్త జిల్లాలకు వెళ్లి తమ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసుకునేందుకు సంబంధిత అధికారులకు ప్రభుత్వం ముందుగానే మౌఖిక ఆదేశాలు జారీ చేయనుంది. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు అన్ని శాఖల కార్యాలయాల ప్రారంభోత్సవాలను ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాకేంద్రాల్లో ఉదయం 11.13 గం. జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసు పరేడ్‍ను నిర్వహింస్తారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍రావుతో పాటు మంత్రులు, జిల్లాధికారులు తమకు నిర్దేశించిన జిల్లాల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గోంటారు.
views: 1141

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams