అమరుడు అనే పదమే మా నిఘంటువులో లేదు : రక్షణ, హోంశాఖ
సైన్యం, పోలీసుల్లో ‘అమరుడు’ అనే పదమే లేదని రక్షణ, హోంశాఖలు తెలిపాయి. విధి నిర్వహణలో మరణించిన సైనికుడు, పోలీసులను యుద్ధ మృతుడు లేదా పోరాట మృతుడుగా తాము పేర్కొంటున్నట్లు కేంద్ర సమాచార కమిషన్‌కు తెలిపాయి. చట్టం, రాజ్యాంగం ప్రకారం ‘అమరుడు’ అనే పదానికి సవివర నిర్వచనాన్ని తెలియజేయాలంటూ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు స్పందించాయి. అమరుడు హోదా దుర్వినియోగం కాకుండా ఉన్న నిబంధను, వాటిని ఉల్లంఘించినవారికి విధించే శిక్షను వివరించాలని కూడా దరఖాస్తుదారుడు కోరారు. సీఐసీలో జరిగిన విచారణకు రక్షణ, హోంశాఖ అధికారులు హాజరై వివరణ ఇచ్చారు.
views: 789

Current Affairs Telugu
e-Magazine
May-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams