నెట్‌ న్యూట్రాలిటీకి అమెరికా వీడ్కోలు
అంతర్జాల సమానత్వం(నెట్‌ న్యూట్రాలిటీ) నిబంధనలకు నీళ్లు వదిలేయాలని అమెరికా టెలికాం నియంత్రణ విభాగం నిర్ణయించింది. ఒబామా కాలంనాటి ఇంటర్నెట్‌ విధానాలను పక్కన పెట్టేయాలని ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌(FCC) నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నియమించిన ఎఫ్‌సీసీ ఛైర్మన్‌, భారతీయ అమెరికన్‌ అజిత్‌ పాయ్‌ ఈ విషయంలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనను 3-2 ఓట్లతో కమిషన్‌ 2017 డిసెంబర్‌ 15న ఆమోదించింది. దీంతో ఇంటర్నెట్‌ సేవలు ప్రొవైడర్లు (ISP) సంస్థలన్నింటికీ ఒకేవిధమైన ప్రాధాన్యమివ్వాలన్న నిబంధనను వెనక్కు తీసుకున్నట్లయింది. ఫలితంగా కొన్ని వెబ్‌సైట్లు కావాలనే నెమ్మదిగా తెరచుకొనేలా, మరికొన్ని తెరచుకోకుండా చేసేందుకు ఐఎస్‌పీకు అడ్డంకిగావున్న నిబంధనను నీరుగార్చినట్లయింది.
FCC- Federal Communications Commission
ISP- Internet service provider

views: 748

Current Affairs Telugu
e-Magazine
May-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
BuyCurrent affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams